ముగిసిన కబడ్డీ పోటీలు

జనగామ జిల్లా : మచ్చుపహాడ్ గ్రామంలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఫైనల్స్ కి చేరాయి. ఈ కబడ్డీ ఫైనల్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర కోకో అసోసియేషన్ అధ్యక్షులు మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన జంగా రాఘవరెడ్డిని మచ్చుపహాడ్ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు జరిగిన కబడ్డీ పోటీల్లో గెలిచిన నవశక్తి టీం సభ్యులకు మొదటి బహుమతిని, టీం సభ్యులకు రెండవ బహ‍ుమతిని జంగా రాఘవరెడ్డి చేతుల మీదుగా బహుకరించారు. గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రయత్నం చేపట్టిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. కబడ్డీ పోటీలు సజావుగా సాగడానికి కృషిచేసిన బృందానికి , ఫిజికల్ ట్రైనర్లకు, క్రీడా ప్రాంగణాన్ని చదును చేయడానికి సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ads

నేటి సమాజంలో విద్యార్థులు, యువత క్రీడల ప్రాధాన్యత తెలుసుకొని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఆటలు ఆడటం వల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగా స్ఫూర్తిని కల్గిస్తాయని, క్రీడలపై ప్రోత్సహించుకోవాలని తెలిపారు. ఈ క్రీడాస్ఫూర్తిని రాబోయే తరాలకు స్పూర్తినిచ్చే విధంగా జిల్లా, రాష్ట్ర , దేశ స్థాయి క్రీడల్లో పాల్గొని కన్నవారికి, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలని జంగా రాఘవరెడ్డి కోరారు.