మావోల చెర నుంచి జవాను రాకేశ్వర్ సింగ్ రిలీజ్

ఛత్తీస్ గఢ్ : మావోయిస్టుల చెర నుంచి కోబ్రా జవాను రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యాడు. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని టెర్రం అడవుల్లో గడిచిన శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు మృతిచెందారు. మరో జవాను రాకేశ్వర్ సింగ్ మావోయిస్టులకు బందీగా చిక్కాడు. గత ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలోనే ఉన్నాడు రాకేశ్వర్ సింగ్. మావోయిస్టులు విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్థుల ద్వారా రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేసినట్లుగా, ప్రస్తుతం అతను టర్రెం పోలీసుల సంరక్షణలో ఉన్నట్లుగా సమాచారం. కాసేపట్లో బెటాలియన్ వద్దకు చేరుకోనున్నాడు.

ads