ఏప్రిల్ లో జేఈఈ మెయిన్ సెషన్ రిజిస్ట్రేషన్లు

న్యూఢిల్లీ : ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. జేఈఈ రాయాలనుకున్న విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్.టీ.ఏ సూచించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్ టీఏ ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరుగనుంది.

ads

జేఈఈ ని ఈయేడాది విడుతల వారీగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. వచ్చే నెలలో మూడో సెషన్ పరీక్ష జరుగనుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు వచ్చేనెల 4న ముగియనున్నాయి. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులతో పాటు , తొలి రెండు సెషన్లు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్ సైట్ : jeemain.nta.nic.in