జో డబుల్ సెంచరీ

చెన్నై: టెస్ట్ చరిత్రలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సరికొత్త అధ్యాయం లిఖించాడు. వందవ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా ఘనత సాధించాడు. చెన్నై టెస్ట్ మ్యాచ్ లో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ శైలిని ప్రదర్శించాడు. బౌలర్లకు సహకరించని చిదంబరం స్టేడియంలో భారీ ఇన్నింగ్స్ ఆడి జో రూట్ దాన్ని తిరగరాసాడు. ఓ భారీ సిక్సర్ తో జో రూట్ తన ఖాతాలో డబుల్ సెంచరీ వేసుకున్నాడు. ఫ్లాట్ గా ఉన్న పిచ్ పై చాలా సులువుగా రూల్ తన షాట్లు ఆడాడు. అతని డబుల్ సెంచరీలో 19 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. నాలుగో వికెట్ కు బెన్ స్టోక్స్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రూట్, స్టోక్స్ నిష్క్రమణ తర్వాత ద్విశతకాన్ని అందుకున్నాడు.

బ్యాటింగ్‎కు అనుకూలమైన వికెట్‎పై రూట్ తన స్టయిలిస్ ఆటను కొనసాగించాడు. ఎటువంటి చెత్త షాట్లు ఆడకుండా, భారీ ఇన్నింగ్స్‎పై దృష్టిపెట్టాడు. టాఫ్ ఫామ్‎లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ చెన్నై మైదానంలోనే తన ఆటతీరుతో అలరించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రూట్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బౌలర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. రెండవ రోజు టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లకు 454 రన్స్ చేసింది. రూట్ 209, పోప్ 24 రన్స్‎తో క్రీజ్‎లో ఉన్నారు.