తెలంగాణ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అపరేష్ కుమార్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గా ఉన్న టి.వినోద్ కుమార్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫార్సు చేసింది.
జస్టిస్ సింగ్ 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకుని, 1990 నుంచి 2000 వరకు పాట్నా హైకర్టులో ప్రాక్టీస్ చేశారు. జార్ఖండ్ హైకోర్టు ఏర్పడిన తర్వాత, 2001 నుంచి న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు అక్కడే ప్రాక్టీస్ కొనసాగించారు. జస్టిస్ సింగ్ 2012 జనవరి 24న జార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2014 జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతు స్వీకరించారు.
2021 ఏప్రిల్ లో, ఆయన జార్ఖండ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమించబడ్డారు. ఇది న్యాయ సేవలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో ఆయన నిబద్ధతను తెలియచేస్తుంది.2022 డిసెంబర్ 20 నుంచి 2023 ఫిబ్రవరి 19 వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా అపరేష్ పనిచేశారు. చివరగా 2023 ఏప్రల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.