కొవిడ్ టీకా తీసుకున్న కమల్‎హాసన్

చెన్నై: ఫిల్మ్ స్టార్, మక్కల్ నీధి మయ్యం పార్టీ చీఫ్ కమల్‎హాసన్ నేడు కొవిడ్ టీకా తీసుకున్నారు. చెన్నైలో ఓ హాస్పిటల్‎లో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. 66 యేండ్ల కమల్‎హాసన్ టీకా తీసుకున్న విషయాన్ని ఆయన తన ట్విట్టర్‎లో పోస్టు చేశారు. అవసరమైన ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన కోరారు. శ్రీరామచంద్ర హాస్పిటల్‎లో వ్యాక్సిన్ తీసుకున్నానని, తమ గురించి, ఇతరుల గురించి ఆలోచించేవారు టీకా వేసుకోవాలన్నారు.

ads

ఇవాళ శరీరాన్ని ఇమ్యునైజ్ చేస్తామని, వచ్చే నెలలో అవినీతికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ చేపడుతామని, దీనికి సిద్ధంగా ఉండాలంటూ తన ట్వీట్‎లో కమల్ తెలిపారు. దేశవ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న ప్రధాని మోడీతో పాటు పలువురు సీఎంలు టీకాలు తీసుకున్నారు. ఇవాళ కొందరు కేంద్ర మంత్రులు టీకాలు తీసుకుంటున్నారు. 60 ఏళ్లు దాటిన వారితో సహా వ్యాధులతో ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి రెండవ దశలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు.