రిహానాకు కంగనా కౌంటర్

ముంబై: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ్యాప్తంగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై పలు విమర్శలు, వారికి మద్దతుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళనపై అమెరికా సింగర్ రిహానా స్పందించింది. రైతుల ఆందోళనకు సంబంధించిన ఓ వార్తను పోస్ట్ చేస్తూ, మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని రిహానా ట్వీట్ చేసింది.

అయితే రిహానా ట్వీట్ కు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు, ఎందుకంటే వాళ్లు రైతులు కాదు ఉగ్రవాదులు అంటూ కంగనా చాలా ఘాటుగా స్పందించింది. వాళ్లు ఇండియాను విభజించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ముక్కలైన దేశాన్ని చైనా ఆక్రమించి అమెరికాలాగా ఇక్కడ కూడా చైనీస్ కాలనీ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, మేము మీలాగా దేశాన్ని అమ్ముకోవడం లేదు అంటూ కంగనా రీ ట్వీట్ చేసింది.