ఏసీబీ వలలో మహిళా ఎమ్మార్వో

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కాటారం ఎమ్మార్వో సునీత ఏసీబీ అధికారులకు పట్టుబడింది. కొత్తపల్లికి చెందిన ఐత హరికృస్ణ కొత్తపల్లి శివారులోని సర్వే నంబర్ 3 లో భూమికి ఆన్లైన్ చేపి పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని కోరాడు. దీని కోసం హరికృష్ణ నుంచి ఎమ్మార్వో రూ. 3లక్షలు డిమాండ్ చేసింది. బాధితుడు అంత డబ్బులు చెల్లించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచలన మేరకు గురువారం రూ. 2లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎమ్మార్వో సునీతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ads