బడా పహాడ్ దర్గాకు చాదర్

నిజామాబాద్ జిల్లా: జిల్లాలోని వర్ని మండల కేంద్రంలో గల ప్రసిద్ధ బడా పహాడ్ దర్గాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాదర్ అందించారు. దర్గా ప్రతినిధులు, ముస్లిం మతగురువులు ఎమ్మెల్సీ కవితను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వర్ని మండలంలో గల ఈ దర్గాలో జరిగే హజ్రత్ సయ్యద్ సాదుల్లా హుస్సేనీ షరీఫ్ 700వ ఉర్సు ఉత్సవాలకు ఈ చాదర్ ను సమర్పించనున్నారు. ఫిబ్రవరి 23-26 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.