దుగ్గొండిలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు

వరంగల్​ రూరల్​ : సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి పిలుపు మేరకు బుధవారం దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామంలో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. ఎన్నారై టీఆర్​ఎస్ సెల్​యూకే అధికార ప్రతినిధి శానబోయిన రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్​ఎస్​ గ్రామ పార్టీ అధ్యక్షులు సింగతి కార్తిక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో 138 యూనిట్ల రక్తం సేకరించి వరంగల్​, నర్సంపేట బ్లడ్​ బ్యాంక్​లకు అందజేశారు. ఎంపీ సంతోష్​కుమార్​ పిలుపు మేరకు కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కేక్​ కట్​ చేశారు.

ఎనమిదేళ్లుగా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నామని ఎన్నారై టీఆర్​ఎస్ సెల్​ యూకే అధికార ప్రతినిధి శానబోయిన రాజ్ కుమార్ అన్నారు. కొవిడ్​ సమయంలో కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు, నాయకులకు రాజ్​కుమార్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్​ఎస్​ ఎన్నారై ఐటీ సెల్​ కార్యదర్శి ఆకుల వినయ్, మందపల్లి పీఎస్​సీఎస్​ చైర్మన్ గుడిపెళ్లి శ్రీనివాసరెడ్డి, పీహెచ్​సీ కొమురయ్య, హెచ్ఎం కనకయ్య, అధ్యాపకులు టీజేఎస్​ఎఫ్​ వరంగల్ జిల్లా అధ్యక్షులు తడిగొప్పుల మల్లేష్ సర్పంచ్​లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.