17న కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ

హైదరాబాద్​: మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట స్టేడియం లో జరుగుతున్న క్రికెట్ టోర్నీలో ఈ నెల 17న ఫైనల్ మ్యాచ్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్యఅతిథులుగా మంత్రి హరీష్ రావు , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ హాజరుకానున్నారని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ట్రోపీ ఆర్గనైజర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి లు తెలిపారు.

‘సిద్దిపేట పట్టణ క్రీడా కారులు ఉత్సహంగా ఈ టోర్నీ లో పాల్గొంటున్నారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేట యువతను , క్రీడా కారులను ప్రోత్సహించేందుకు 16 రకాల క్రీడలకు హబ్ కు అభివృద్ధి చేశారు అని రాజనర్సు, వేణుగోపాల్​రెడ్డి పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాయని చెప్పారు. ఆ దిశగా సిద్దిపేట క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నారన్నారు. వారి నైపుణ్యాలను బట్టి రాష్ట్ర స్థాయి క్రీడల్లో అవకాశాలు వచ్చేలా మంత్రి హరీష్ రావు క్రీడా హబ్ కు కృషి చేస్తున్నారన్నారు రాజనర్సు, వేణుగోపాల్​రెడ్డి. అందుకు నిదర్శనంగా కేసీఆర్ క్రికెట్ కప్ యువత నుంచి స్పందన ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా క్రికెట్ టోర్నీ నిర్వహించేందుకు మంత్రి హరీష్ రావు నిర్ణయించినట్లు వారు తెలిపారు. త్వరలోనే మండలాల వారిగా మ్యాచ్ లు నిర్వహిస్తామని’మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ట్రోపీ ఆర్గనైజర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి లు వెల్లడించారు.

ఈ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో విన్నర్స్ , రన్నర్స్ గా నిలిచిన టీమ్స్ కి హైదరాబాద్ వండర్ లా పర్యాటక క్షేత్రం లో ఉచితంగా ఎంట్రీ కల్పించేందుకు ఆ యాజమాన్యం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. వారికి ధన్యవాదాలు చెప్పారు. సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కు క్రీడాకారులు , అభిమానులు, సిటీజెన్స్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి కోరారు రాజనర్సు, వేణుగోపాల్ రెడ్డి లు .

కేసీఆర్ బర్త్ డే రోజు సంబరాలు

కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మంత్రి హరీష్ రావు సమక్షంలో సిద్దిపేట లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట క్రికెట్ స్టేడియం లోనే పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని అంటే విధంగా జరుపుతామన్నారు. అదేవిధంగా పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఉంటుందని ’మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , ట్రోపీ ఆర్గనైజర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిప్ప ప్రభాకర్ , మోహిజ్ , కలకుంట్ల మల్లికార్జున్ , శేఖర్ గౌడ్, ఈర్షద్ హుస్సేన్ , బాబ్ జానీ, మహేష్ , రాము , అక్బర్, జమ్మూ తదితరులు ఉన్నారు .