మోసపోయిన సీఎం కూతురు

ఢిల్లీ : సైబర్ నేరగాడి చేతిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత మోసపోయింది. ఓ ఈ కామర్స్ సైట్లో పాత సోఫాను అమ్మకానికి పెట్టగా, ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. క్యూఆర్ కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే తాను ఇవ్వాల్సిన మొత్తం అకౌంటు ట్రాన్స్‎ఫర్ అవుతుందని నమ్మించాడు. అలా చేయగానే హర్షిత ఖాతా నుంచి రూ.20వేలు మాయమయ్యాయి. అది తప్పు కోడ్ అని, సరైన కోడ్ పంపుతానని నమ్మించాడు. అలా మరో రూ.14వేలుఖాళీ అయ్యాయి.