వెనుకంజలో ఖుష్బూ సుందర్

చెన్నై : తమిళనాడు బీజేపీ అభ్యర్థి ఖుష్బూ సుందర్ వెనుకంజలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థి ఎజ్ హిలన్ , ఆ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఖుష్బూ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. 5 రౌండ్లు ముగిసే వరకు ఎజ్ హిలన్ సుమారు 9 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గత యేడాది అక్టోబర్ లో ఖుష్బూ , బీజేపీ పార్టీలో చేరారు. 2010లో డీఎంకేలో చేరిన ఖుష్బూ , ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. 2014 సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫిజీషియన్ డాక్టర్ అయిన ఎజ్ హిలన్ తన ప్రచారంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.

ads

డీఎంకే యూత్ వింగ్ చీఫ్ ఉదయనిధి స్టాలిన్ లీడింగ్ లో ఉన్నారు. చెపాక్ తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఉదయనిధి పోటీలో ఉన్నారు. 5 రౌండ్లు ముగిసే వరకు ఉదయనిధి 13వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గతంలో మాజీ సీఎం కరుణానిధి ఈ స్థానం నుంచి పోటీ చేసేవారు. కోయంబత్తూరులో ఫిల్మ్ స్టార్ కమల్ హాసన్ కు కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. బోదినాయకనూర్ నుంచి పన్నీరు సెల్వం వెనుకంజలో ఉన్నారు.