నిర్మల్ జిల్లా : కొన్ని రోజులుగా భైంసాలో ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భైంసాకు ఏఎస్పీగా 2017 ఐపీఎస్ బ్యాచ్ అధికారి కిరణ్ ప్రభాకర్ ఖరేను నియమిస్తూ డీజీపీ మహేందర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కిరణ్ప్రభాకర్ ఖరే మహారాష్ట్ర వాసి. ఇప్పటికే భైంసాలో స్పెషల్ పార్టీ బలగాలతో పాటు వందలమంది పోలీసులతో పలు చోట్ల పికెట్స్ ఏర్పాటు చేశారు. మళ్లీ ఘర్షణలు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. పట్టణంలో ఇప్పటికీ 144 సెక్షన్ అమలులో ఉంది.
