108 రన్స్ చేసి కేఎల్ రాహుల్

పుణె : ఇంగ్లండ్ తో పుణెలో జరుగుతున్న రెండవ వన్డేలో కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేశాడు. నిజానికి ఇంగ్లండ్‎తో జరిగిన టీ20 మ్యాచుల్లో దారుణంగా విఫలమైన రాహుల్, వన్డేల్లో మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. తొలి వన్డేలో 43 బంతుల్లో 62 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచిన రాహుల్, ఈరోజు రెండవ వన్డేలో సెంచరీ కొట్టాడు. రాహుల్‎కు ఇది వన్డేల్లో 5వ సెంచరీ కావడం విశేషం. రాహుల్ 114 బంతుల్లో 108 రన్స్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. ఇక అయ్యర్ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్, బ్యాటింగ్ లో దూకుడు ప్రదర్శించాడు. శరవేగంగా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 28 బంతుల్లోనే పంత్ 50 రన్స్ చేశాడు. 45 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 273 రన్స్ చేసింది.

ads