సునీల్ ను పరామర్శించిన కోదండరాం,మల్లన్న

వరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసుకుని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న యువకుడు బోడ సునీల్ ను పలు రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, తీన్మార్ మల్లన్నలు వేరువేరుగా బోడ సునీల్ ను పరామర్శించారు. ఎంజీఎం చికిత్స పొందుతున్న బాధిత యువకుడికి వారు ధైర్యం చెప్పారు. కొట్లాది సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించుకునేందుకు మరో సారి ఉద్యమబాట పట్టాలి తప్ప ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దని వారు తెలిపారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని వారు సూచించారు.

ads