కోహ్లీ అరుదైన ఘనత

దుబాయ్​ : భారత్​ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మరో అరుదైన ఘనత నెలకొల్పాడు. ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో కోహ్లీ ఒకప్పటి బ్యాటింగ్​ స్టైల్​ను కనబర్చాడు. వరుసగా రెండు టీ20ల్లోనూ హాఫ్​సెంచరీలతో విజృంభించాడు. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్​ కౌన్సిల్​ ప్రకటించిన టీ 20 ర్యాంకింగ్స్​లో కోహ్లీ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకులో నిలిచాడు. ఇండియా నుంచి కేఎల్​ రాహుల్​ ఒక్కడే ఫోర్త్​ ప్లేస్​లో చోటు దక్కించుకున్నారు. టెస్టు బ్యాంటింగ్​ ర్యాంకింగ్స్​లో ఐదో ప్లేస్​లో ఉన్న కోహ్లీ వన్డేల్లోనూ మొదటిస్థానంలో ఉన్నాడు. కోహ్లీ గతంలో పొట్టి ఫార్మాట్​లో టాప్​ ర్యాంకును కూడా అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో టాప్​-5లో స్థానం సంపాదించిన ఏకైక బ్యాట్స్​మెన్​గా కోహ్లీ ఘనత సాధించాడు. ఇండియా నుంచి శ్రేయస్​ అయ్యర్​, రిషబ్​పంత్​, వాషింగ్టన్​ సుందర్​, శార్దుల్​ ఠాకూర్​, భువనేశ్వర్​ కుమార్​ తమ ర్యాంకులను మెరుగు పరుచుకున్నారు.

ads