రెండు రికార్డులకు చేరువలో

చెన్నై : ఇంగ్లండ్‎తో ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్‎లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు రికార్డులకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు టీం ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరంటే ఎమ్మెస్ ధోనియే గుర్తు వచ్చేవాడు. కానీ ఇప్పుడా రికార్డును ఇంగ్లండ్‎తో సిరీస్‎లోనే కోహ్లి చెరిపేసే అవకాశాలున్నాయి. సొంతగడ్డపై కెప్టెన్‎గా ధోనీ 21 టీంలను గెలిపించినాడు.

ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్‎గా అత్యధిక పరుగులు చేసిన వాళ్ల లిస్టులో నాలుగో స్థానానికి ఎగబాకడానికి కోహ్లీ 14 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ టెస్టుల్లో కెప్పెన్‎గా 5220 పరుగులు చేశాడు. మరో 14 పరుగులు చేస్తే, విండీస్ దిగ్గజం లాయిడ్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. కోహ్లీ, లాయిడ్ కంటే ముందు గ్రేమ్ స్మిత్ (8659), అలన్ బోర్డర్ (6623), రికీ పాంటింగ్ (6542) ఉన్నారు. ఇంగ్లండ్-ఇండియా మధ్య తొలి టెస్ట్ ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో జరుగనున్న విషయం తెలిసిందే.