3 రోజుల కఠిన క్వారెంటైన్ లో కోహ్లీ సేన

సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్నది. సౌతాంప్టన్ లో ఉన్న ఏజీయస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయనున్నారు. అయితే తొలి 3 రోజుల పాటు క్రికెటర్లు కఠిన క్వారెంటైన్ లో ఉండనున్నారు. క్రికెటర్లు ఒకరిని ఒకరు చూసుకునే వీలు కూడా ఉండదట. ఈ విషయాన్ని క్రికెటర్ అక్షర్ పటేల్ తెలిపాడు. ముంబై నుంచి సౌతాంప్టన్ బయలుదేరిన విమానంలో పురుషులు, మహిళల జట్టు క్రికెటర్లు వెళ్లారు. విమానంలో ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియోను నేడు బీసీసీఐ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ads

జూన్ 15న న్యూజీలాండ్ తో టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన న్యూజీలాండ్ అక్కడ ఆతిథ్య జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ముంబైలో 14 రోజులు క్వారెంటైన్ తర్వాత టీం ఇండియా ఇంగ్లండ్ బయల్దేరింది.