హర్యానా పర్యటనలో మంత్రి

హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఢిల్లీ నుంచి హర్యానాకు బయలుదేరారు. హర్యానా పర్యటనకు వెళుతూ మార్గమధ్యలో సోమవారం రాత్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంత్రి బస చేశారు. కొప్పులతో పాటు అధికారులు హర్యానాకు బయలుదేరగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉత్పల్ లు వారికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ మినీ డెయిరీల ఏర్పాటుకు మహిళలకు సబ్సిడీపై రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ డెయిరీల కోసం హర్యానా నుంచి మేలిరకం బర్రెలు తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా పశుసంపదను, పాడి పరిశ్రమ తీరుతెన్నులు పరిశీలించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్యానాకు వెళ్లారు.