గురుకులాల్లో కొవిడ్​ కలకలం

కామారెడ్డి జిల్లా : జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్​ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొవిడ్​ కలకలం రేపింది. పాఠశాలలోని 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్​గా తేలింది. స్కూల్​లోని ఆరుగురు ఉపాధ్యాయులకు కొవిడ్​ లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తయ్యారు. వెంటనే విద్యార్థినులకు కరోనా టెస్టులు నిర్వహించగా 32 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. కానీ విద్యార్థులకు ఎటువంటి లక్షణాలు లేవని డీఎంహెచ్​వో చంద్రశేఖర్​ వెల్లడించారు. పాజిటివ్​ వచ్చిన విద్యార్థులను హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించినట్లు తెలిపారు. అలాగే నగరంలోని నాగోల్​ బండ్లగూడ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్​ బాలికల పాఠశాలలో సుమారు 36 మందికి పాజిటివ్​ ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు మిగతా విద్యార్థులకు కరోనా టెస్టు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భయంతో విద్యార్థినులను ఇంటికి తీసుకెళ్తున్నారు.

ads