పేరెంట్స్ ప్రోత్సాహం ఉండాలి

రాజన్న సిరిసిల్లా జిల్లా : రాష్ట్రంలో సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పిల్లలకు ఎంతచేసినా తక్కువేనని అన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని గీతానగర్ లో సకల వసతులతో పునరుద్దరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.3కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు సరిపడేలా 33 గదులను నిర్మించారు. డైనింగ్ హాల్, వాలీబాల్ , ఫుట్ బాల్ కోర్టులు, సీసీ కెమెరాలు, అత్యాధునికమైన గ్రంథాలయం, మోడ్రన్ టాయిలెట్స్, సురక్షిత త్రాగునీరు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‎తో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ బోయినపల్లి, జిల్లా కలెక్టర్ కలెక్టర్ కృష్ణ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.