కేసీఆర్​ అర్బన్ ఏకో పార్క్​ ఘనత మాదే

మహబూబ్​నగర్​ జిల్లా : తెలంగాణ ఏర్పడిన తర్వాత 2087 ఎకరాల్లో కేసీఆర్​ అర్బన్ ఏకో పార్క్ ను దేశంలోనే అతిపెద్ద పార్క్ గా అభివృద్ధి చేసిన ఘనత టీఆర్​ఎస్​ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని కేసీఆర్​ అర్బన్ ఏకో పార్క్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వెంకటరావుతో కలసి ప్రారంభించారు. చిన్నపిల్లల ట్రాయ్ ట్రైన్ ను, పార్క్ లో ఉన్న లేక్ లో పర్యాటకుల, సందర్శకుల కోసం పెడల్ బోట్స్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా బట్టర్ ఫ్లై పార్క్ ను ప్రారంభించారు.
పక్క రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి పర్యాటకులను ఈ పార్కుకు వచ్చే విధంగా కృషి చేస్తామని మంత్రి అన్నారు. పార్క్ ను చూసేందుకు వేలాదిమంది సందర్శకులు ప్రతిరోజూ వస్తున్నారని మంత్రి చెప్పారు. అనంతరం కేసీఆర్​ ఏకో అర్బన్ పార్క్ పై రూపొందించిన 2021 క్యాలెండర్ ను అటవీశాఖ అధికారులతో కలసి మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు రాం లక్ష్మణ్, జెడ్పీటీసీలు, ఎంపీపీ లతో పాటు అటవీశాఖ అధికారులు డీఎఫ్​వో గంగిరెడ్డి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.