కుంట శ్రీనివాస్ సస్పెండ్

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‎ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తక్షణమే అమలవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‎రెడ్డి తెలిపారు. న్యాయవాది వామన్‎రావు దంపతుల హత్య కేసులో కుంట శ్రీనివాస్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. క్రమశిక్షనా చర్యలు చేపట్టిన అధిష్టానం ఈ మేరకు సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం వెలువరించింది.