వరంగల్ అర్బన్ ఏడీగా లక్ష్మణ్ కుమార్ పదవీ బాధ్యతలు

వరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ అర్బన్ జిల్లా పౌర సంబంధాల అధికారిగా లక్ష్మణ్ కుమార్ శుక్రవారంనాడు పదవీ బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయంలో మేనేజర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఆయనను వరంగల్ అర్బన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పల్లవి నుండి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సమాచార శాఖ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొనే విధంగా ప్రచారం చేయాలని, జర్నలిస్టులకు సమాచారం ఎప్పటికప్పుడు సకాలంలో చేరవేయాలని కలెక్టర్ సూచించారు.

ads