భారీ ఎత్తున గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా : ఆదివారం ఉదయం విశాఖ జిల్లా అరకులో డుంబ్రి గూడా మండలం గొరాపుర్ జంక్షన్ వద్ద భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కే రాజారావు తెలియజేశారు. వైజాగ్ రూరల్ అడిషనల్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, మరియు డిప్యూటీ కమిషనర్ టీ శ్రినిసరావు గారి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం గోరాపుర్ జంక్షన్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, గుజరాత్ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఓ వాహనం వేగంగా రావడం గమనించిన అధికారులు ఆబవాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఆ వాహనాన్ని డ్రైవర్ ఆపకుండా మరింత వేగంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

ads

అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని వెంబడించగా కొంత దూరం తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారు అయ్యాడు. ఆ వాహనాన్ని తనిఖీ చెయ్యగా 500 కేజీలకు పైగా గంజాయి దొరికినట్టు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రాజారావు మీడియాకు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు.