లా సీట్ల భర్తీకి 25న అడ్మిషన్లు

హైదరాబాద్: నగర శివార్లలో ఉన్న ఘట్ కేసర్ ఎస్సీ గురుకుల మహిళా లా కాలేజీలో స్పాట్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని సంక్షేమశాఖ కమిషనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్‎బీ కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తామని వెల్లడించారు. ఘట్ కేసర్ లా కాలేజీలో వచ్చే గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. లాసెట్ ర్యాంకు ఆధారంగా స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తామని తెలిపారు.