లాసెట్, పీజీఎల్ సెట్ అప్లికేషన్ల టైం పొడిగింపు

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. లాసెట్ , పీజీ ఎల్సెట్ దరఖాస్తులను ఈనెల 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా స్వీకరించనున్నారు. గతంలో మే 26 వరకు మాత్రమే దరఖాస్తులకు తుదిగడువుగా నిర్ణయించగా, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జూన్ 3 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ గడువును గురువారం మరోసారి పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ads