మహాయజ్ఞంలో అందరం పాల్గొందాం

జగిత్యాల జిల్లా : కొండగట్టు అంజన్నకు 11 కోట్ల రామకోటిని నివేదించాలనే లక్ష్యంతో సాగనున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరం పాల్గొందామని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. బుధవారం నుంచి కొండగట్టు అంజన్నసేవా సమితి’ ఆధ్వర్యంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో ‌కొండగట్టు అంజన్న పుణ్య క్షేత్రంలో, రాష్ట్రంలోని ప్రముఖ అంజన్న దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రెండు మండలాల కాలం ప్రతి రోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు జరిగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని తెలిపారు. మన ఊరి గుడి నుంచి, మన ఇంటి నుంచి మనం కూడా పాల్గొందాం అని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

ads