రాములు నాయక్‎ను గెలిపిద్దాం: ఉత్తమ్

వరంగల్ అర్బన్ జిల్లా : పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు ప్రతీ ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎం.ఎల్.సి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ కుమార్ రెడ్డి కేయూలో విద్యార్థులతో సమావేశమయ్యారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎం.ఎ.ల్.సి. ప్రచారంలో భాగంగా నేడు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎం.ఎల్.సి. అభ్యర్థి రాములు నాయక్, వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్‎రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి కాకతీయ యూనివర్సిటీ బోధనా సిబ్బంది, ఫాకల్టి మరియు విద్యార్థులను పరిచయం చేసుకొని నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎం.ఎల్.సి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సభావాత్ రాములు నాయక్‎కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ads

వేలాది మంది నిరుద్యోగుల ఆత్మ బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రము నేడు గడిలలో బంది అయ్యిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు పారిశ్రామిక వేత్తలతో కలిసి దేశాన్ని నిండా దోచుకుంటున్నారు. రెండున్నర నెలలు పైబడి చేస్తున్న రైతు ఉద్యమంలో దాదాపు 200 మంది రైతులు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన దానిమీద, ప్రేమ, వైజాగ్ స్టీల్, ఎఫ్.సి.ఐ, బి.ఎస్.ఎన్.ఎల్, ఎల్.ఐ.సి., షిప్పింగ్ కార్పొరేషన్ లాంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్లను అమ్మే పనిలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఉత్తమ్ అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల రీ డిజైన్ల పేరుతొ కమీషన్లు దండుకున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అప్రజాస్వామికం కాదా అని ప్రశ్నించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు, ప్రైవేట్ టీచర్లకు, ఫీల్డ్ అసిస్టెంట్‎లకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చ లేదని ఆరోపించారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని టీఆర్ఎస్, బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. ఏనాడు పట్టభద్రుల సమస్యలు పట్టించుకోని టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. చట్ట సభలలో మన గళాన్ని ప్రభుత్వంకు వినిపించి, సమస్యల పరిష్కారంకు కృషి చేసే, పోరాడే సత్తా ఉన్న తెలంగాణా ఉద్యమ బిడ్డ, కార్మిక నేత రాములు నాయక్‎కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన విన్నవించారు.

ఈ కార్యక్రమంలో మంథని ఎం.ఎల్.ఎ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మాజీ ఎం.పి. వి. హనుమంత రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, తెలంగాణా ఉత్తర జిల్లాల కో-ఆర్డి నేటర్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, టీపీసీసీ కార్యదర్శులు మీసాల ప్రకాష్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు, దుబ్బా శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, గ్రేటర్ వరంగల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, వరంగల్ వెస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కందికొండ చిన్న రాజు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లకొండ సతీష్, డివిజన్ అద్యక్షులు, వరంగల్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహళ్, జిల్లా మరియు నగర కాంగ్రెస్ నాయకులు జిల్లా మరియు నగర అనుబంధ సంఘాల అద్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.