వేముల శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

గ్రేటర్ వరంగల్ : ఏప్రిల్ 30న జరుగనున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో 66 డివిజన్లలో ఆయా పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 7వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి వేముల శ్రీనివాస్ ప్రచారాన్ని కొనసాగించారు. 7వ డివిజన్ లోని కంచరకుంట, కాకాజీకాలనీ, బ్రాహ్మణవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించిన టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి వేముల శ్రీనివాస్ కు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థి వేముల శ్రీనివాస్ కు స్థానిక మహిళలు కుంకుమ బొట్టు పెట్టి, మంగళహారతులు పడుతున్నారు. ప్రతీ ఒక్కరూ టీఆర్ఎస్ కే మా ఓటు అంటూ స్వాగతిస్తున్నారు. వేముల శ్రీనివాస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు.

ads

బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరికలు
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగానే కంచరకుంట నుంచి బీజేపీ పార్టీకి సంబంధించిన 150 మంది కార్యకర్తలు వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి వేముల శ్రీనివాస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల శ్రీనివాస్ తో పాటు శేఖర్, రాజశేఖర్, చిన్న నర్సింగ్, సారంగపాణి , కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.