మార్చి 31వరకు లాక్‎డౌన్ పొడిగింపు

చెన్నై: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్‎ను ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆదివారం రాత్రి తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి విస్తృతిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అందరూ మాస్కులు ధరించేలా, సోషల్ డిస్టెన్స్ , శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికార యంత్రాంగాలకు తన ఆదేశాల ద్వారా సూచనలు చేసింది. గత 24 గంటల్లో తమిళనాడులో 486 మంది కరోనా వైరస్ బారినపడగా, 5గురు మృతిచెందారని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ads