లాక్ డౌన్ మరో వారం పొడిగింపు

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవారం రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ గడువు మే 3 ఉదయం 5 గంటలకు ముగియనుంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రోజుకు 25వేలకు మించకుండా నమోదవుతుండటంతో లాక్ డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది. నిన్న ఒక్క రోజే ఢిల్లీలో 27 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 375 మంది మరణించారు. వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ads