హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రూపొందిన చిత్రం “మ్యాడ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. “మ్యాడ్” సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్ బ్యానర్‌పై టి.వేణు గోపాల్ రెడ్డి, బి.కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాతలుగా లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా హాజరై “మ్యాడ్” చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
మా కార్యక్రమానికి గెస్ట్లుగా వచ్చిన మధుర శ్రీధర్, రాధాకృష్ణకి థ్యాంక్స్. శ్రీధర్ నా సోదరుని లాంటివారు. ఎంతో సపోర్ట్ చేశారు. నేను మీడియాను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే. చిన్న సినిమా మీ ప్రోత్సాహం వల్ల పెద్ద సినిమా అవుతుంది. మీరు చిరంజీవి, బాలకృష్ణ గురించి రాస్తారు. చిన్న సినిమాల గురించి రాస్తారు. నేను సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను. మా సినిమా బాగుంటే చాలా బాగుందని, ఫర్వాలేదనుకుంటే మంచి ప్రయత్నం అని రాయండని దర్శకుడు లక్ష్మణ్ మేనేని విన్నవించారు. మీడియా ప్రోత్సహిస్తే మామూలు సినిమా బెటర్ సినిమా అవుతుంది. మేము గొప్ప సినిమా చేశామని చెప్పడం లేదు. చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాం. మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నాం. వాళ్లతో మాట్లాడిన తర్వాత “మ్యాడ్” సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. మార్చిలో ఖచ్చితంగా రిలీజ్ ఉంటుందని దర్శకుడు లక్ష్మణ్ మేనేని అన్నారు.
దర్శకుడు లక్ష్మణ్ నాకు మంచి మిత్రుడు. మ్యాడ్ మూవీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. ఇవాళ యూత్ లైఫ్‌లో జరుగుతున్న కాంటెంపరరీ కాన్సెప్ట్ ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ల ప్రతిభ చూపించారు. సంగీత దర్శకుడు మోహిత్‌కు ఇండస్ట్రీలో పేరు రావాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బాగుంది, సూపర్ రెస్పాన్స్ రావాలి. అలాగే సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నానని ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు.
చాలా రోజులుగా ఈ రోజు గురించి వేచి చూశాము. లక్ష్మణ్ గారికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ కూడా ఇలాగే మీకు నచ్చుతుంది. ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారని హీరో మాధవ్ చిలుకూరి అన్నారు. టీమ్ అందరికీ మీ బ్లెస్సింగ్స్‌కు కావాలని ఆయన కోరారు. అతిథిగా వచ్చిన మధుర శ్రీధర్‌కి థ్యాంక్స్ అని చెప్పారు.
ట్రైలర్ చూస్తే ఎలాంటి సినిమానో మీకు కొంత అర్థమై ఉంటుందని హీరో రజత్ రాఘవ్ అన్నారు. మ్యాడ్ అంటే పిచ్చి అని కాదు మ్యారేజ్ అండ్ డివోర్స్ అని అర్థం. మ్యాడ్ అంటే ఏంటని పజిల్స్ పెట్టేవారు డెరెక్టర్. కానీ మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే టైటిల్ కుదిరింది. టైటిల్‌కు తగినట్లే కథ ఉంటుంది. ఈ కథలో విలన్లు ఎవరూ ఉండరు. చిన్న చిన్న గొడవల వల్ల హీరో హీరోయిన్లు విడిపోతుంటాయి. మోహిత్ రెహ్మానియా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మ్యూజిక్‌ను మధుర శ్రీధర్ ప్రమోట్ చేసి తన ఆడియో ద్వారా ప్రచారం తీసుకొచ్చారు అని హీరో రజత్ రాఘవ్ అన్నారు.
చెన్నై నుంచి వచ్చాక నా మొదటి సినిమా “మ్యాడ్”. సంగీత దర్శకుడికి దర్శకుడి విజన్ ఉండాలి. లక్ష్మణ్ గారికి చాలా క్లారిటీ ఉంది. టెక్నీషియన్ కు ఏది కావాలో ఆయనకు తెలుసు. కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా పనిచేశారని మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహ్మానియా అన్నారు.
సినిమా మిమ్మల్ని మర్చిపోయేలా ఉండాలని ఓ ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ అన్నారని శ్వేత వర్మ అన్నారు. “మ్యాడ్” సినిమా కూడా చూస్తున్నంత సేపూ మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేస్తుంది. లవ్, సినిమా, మ్యూజిక్ …ఈ మూడు మాత్రమే బయట ప్రపంచం మర్చిపోయేలా లీనం చేస్తాయి. “మ్యాడ్” చూస్తున్నప్పుడుమిమ్మల్ని మీరు కథలో చూసుకుంటారు. మీ జీవితంలో జరిగే సంఘటనలే సినిమాలోఉంటాయి. కరోనా తర్వాత ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజై సక్సెస్ అవుతున్నాయి. మా సినిమాకు కూడా మీ ప్రేమ కావాలని ఆమె కోరారు.
నా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాకు పనిచేసిన అందరికీ కంగ్రాట్స్. సినిమా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ఇది నా మొదటి సినిమా. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని నిర్మాత కృష్ణారెడ్డి కోరారు.
“మ్యాడ్” లో కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణ అన్నారు. ఆర్టిస్ట్‌లు చాలా ఇన్వాల్వ్ అయి నటించారు. చిన్న చిత్రాలను ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సినిమా షూర్ హిట్ అనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మీడియా వాళ్లు బిజీగా ఉన్నా వచ్చినందుకు థ్యాంక్స్. ట్రెడిషనల్ తెలుగు అమ్మాయి రోల్ చేయాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ లక్ష్మణ్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నిర్మాత కృష్ణారెడ్డి రోజూ సెట్‌కు వచ్చి షూటింగ్ గురించి తెలుసుకునేవారు. మోహిత్ వినసొంపైన సంగీతాన్ని ఇచ్చారు. శ్రీధర్ మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్. మా పాటలను బాగా ప్రమోట్ చేశారని స్పందన పల్లి అన్నారు.
“మ్యాడ్” చిత్రానికి ప్రొడ్యూసర్స్ : టి. వేణుగోపాల్ రెడ్డి, బి.కృష్ణా రెడ్డి & మిత్రులు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు,
కెమెరా : రఘు మందాటి,
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్,
సంగీతం : మోహిత్ రెహ్మానియాక్,
లిరిక్స్ : ప్రియాంక, శ్రీరామ్ ,
పి ఆర్ ఒ : జియస్ కె మీడియా.