మానసిక ఆస్పత్రికి నిందితులు

చిత్తూరు జిల్లా: మూఢభక్తితో కన్నకూతుర్లను హత్యచేసిన చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన దంపతులు పురుషోత్తం, పద్మజలను పోలీసులు బుధవారం విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టు చేసిన అనంతరం నిందితులను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.

వారి మానసిక స్థితి బాగా లేకపోవడంతో ఇటీవల నిందితులను తిరుపతి రుయాకు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ పురుషోత్తం, పద్మజను పరీక్షించిన వైద్యులు కస్టోడియన్‌ కేర్‌ కావాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో జైలు వాతావరణంలోనే చికిత్స అందించేందుకు వీలుగా సరైన వ్యవస్థ ఉండాలన్నారు. జైలులో అలాంటి వసతులు లేనందునే విశాఖలోని కస్టోడియన్‌ కేర్‌కు నిందితులను తరలించాలని సిఫార్సు చేసినట్లు రుయా వైద్యులు వివరించారు.