ఏసీబీకి చిక్కిన అధికారులు, ప్రజాప్రతినిధులు

రంగారెడ్డి జిల్లా : మహేశ్వరం ఎంపీడీఓ కార్యాలయం, మంచాల పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒకే కేసులో ఏడున్నర లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు అధికారులు, ప్రజాప్రతినిధులు. భూమి లే అవుట్ పర్మిషన్ కోసం యజమాని ముత్యంరెడ్డి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఎంపిఓ సిహెచ్ అధికారి శ్రీనివాస్ .

అలాగే మహేశ్వరం ఎంపీడీఓ కార్యాలయంలో, మాన్సాన్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఐదున్నర ఎకరాల భూమి లే అవుట్ అనువతి ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు అధికారులు. ఇదే కేసులో ఐదున్నర లక్షలు తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్ భర్త కంది రమేష్, ఉప సర్పంచ్ బుర్రమోని నర్సింహ యాదవ్లు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. దీంతో మహేశ్వరం ఎంపీడీవో కార్యాలయంలో, మాన్సాన్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వీరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.