ఊరికో మహిళా పోలీస్..డీజీపీకి సీఎం ఆదేశం

*సచివాలయ ‘కార్యదర్శి’హోదా మార్పు
*కానిస్టేబుళ్లతో సమానంగా అధికారాలు
*పోలీస్ యూనిఫామ్‌లోనే విధులు
*పదోన్నతులకు అవకాశం.. జీవో జారీ
*ప్రతి మహిళ ఫోన్‌లో ‘దిశ’ యాప్‌
*ఇంటింటికీ వెళ్లి డౌన్‌లోడ్‌ చేయించండిఅమరావతి : వాళ్లు పోలీసులు కాని పోలీసులు ! పోలీసులుగా నియమితులు కాకున్నా, పోలీసు శిక్షణ తీసుకోకపోయినా… వారూ పోలీసులే! ఇది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శుల హోదాను ‘మహిళా పోలీసు’గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఇకపై వీరంతా గ్రామ సచివాలయాల్లో పోలీసు యూనిఫామ్‌లోనే విధులు నిర్వర్తిస్తారు. పోలీసు కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలన్నీ  వీరికీ కల్పిస్తారు. వీరంతా తమ పరిధిలో సంబంధిత పోలీసు స్టేషన్‌ ప్రతినిధులుగా వ్యవహరిస్తారని జీవోలో తెలిపారు. వీరికి పోలీసు శిక్షణ కూడా ఇస్తామన్నారు. మరోవైపు… ఈ ‘మహిళా పోలీసు’లకు పదోన్నతులు కూడా కల్పిస్తామన్నారు. దీనికోసం అదనంగా హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు సృష్టిస్తామని హోంశాఖ తెలిపింది. ఈ మేరకు అవసరమైన చట్ట సవరణలను చేస్తామని చెప్పింది.

ads

ప్రతీ ఫోన్‌లో ‘దిశ’యాప్‌

తాడేపల్లి ప్రాంతంలో సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై  బుధవారం సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ‘‘రాష్ట్రంలోని ప్రతీ మహిళ మొబైల్‌ ఫోన్‌లో ‘దిశ’యాప్‌ తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి. స్థానిక పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళల ఫోన్‌లలో దిశ యాప్‌ను డౌన్లోడ్‌ చేయించాలి’’అని ఆదేశించారు. ‘దిశ’సిబ్బంది సకాలంలో స్పందించేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డి, దిశ అధికారి దీపికా పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని స్మారక చిహ్నాలు, కోటల అభివృద్ధి పనులను చేపట్టాలని, వరంగల్, కరీంనగర్ లలోని మ్యూజియంల నవీకరణ, పునర్నిర్మాణం, పునరుద్ధరణ ప్రతిపాదనలను చేపట్టాలని అధికారులను ప్రతినిధి బృందం కోరింది. గోల్కొండ సౌండ్ లైట్ షోను ప్రస్తుత స్థలం నుండి చక్కగా విస్తృతంగా కనిపించే క్రొత్త స్థలానికి మార్చే పనులు వేగం చేయాలన్నారు. మహబూబ్‌నగర్‌లోని సాంస్కృతిక సముదాయం అభివృద్ధికిగాను కేంద్ర ఆర్థిక సహాయం రూ .15 కోట్లు మంజూరుచేయాలని ప్రతినిధి బృందం అభ్యర్థించింది.