సింగర్ నసీమ్ మృతి

తిరువనంతపురం : అలనాటి మలయాళ గాయకుడు ఎంఎస్ నసీమ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యాహ్నం తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నసీమ్‎కు భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆయనకు 16 యేండ్ల క్రిందటే గుండెపోటు వచ్చిందని, అప్పటి నుంచి గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.

నసీమ్ మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అదేవిధంగా కేరళకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నసీమ్‎ మృతికి సంతాపం తెలియచేశారు.

నసీమ్ దూరదర్శన్, ఆకాశవాణి, ఇతర స్టేజ్ ప్రోగ్రామ్‎లలో కలిపి మొత్తం వెయ్యికి పైగా పాటలు పాడారు. మహ్మద్ రఫీ, బాబూరాజ్ పాటలు పాడుతూ ఆయన ప్రేక్షకులను మంత్రముద్ధులను చేసేవారు. ఎంఎస్ నసీమ్ , మినీ స్క్రీన్ ప్రోగ్రామ్స్‎లోనే గాక రెండు సినిమాలకు కూడా పాడారు. ఆయన అద్భుత గానానికి గానే కేరళ సంగీత నాటక అకాడమీ ఉత్తమ గాయకుడి అవార్డుతో సత్కరించింది. అంతేగాక 1992, 1993, 1995,1997లో నసీమ్ బెస్ట్ మినీ స్క్రీ్ సింగర్ అవార్డులు పొందారు.