రేప్ కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్ : అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష , జరిమానా విధించింది. ఈఘటన నల్లగొండలో మంగళవారం చోటుచేసుకుంది. అక్టోబర్ 2011న మూసీ నది తీరం మోత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిగుట్టలో నీలగిరి నర్సయ్య (30) అనే వ్యక్తి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్దకు పనుల నిమిత్తం మహిళ వెళ్తుండగా, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నర్సయ్యను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం దోషిగా తేలిన నర్సయ్యకు కోర్టు 10యేండ్లు జైలు శిక్ష విధించడంతో పాటు రూ.50వేలు జరిమానా విధించింది.

ads