నకిలీ గన్​తో హల్​చల్​

విశాఖ జిల్లా : ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో నకిలీ గన్​తో శనివారం ఓ పర్యాటకుడు హల్ చల్ చేశాడు . రాత్రి 10 గంటల సమయంలో అరకు లోయ మెయిన్ రోడ్డులోని పాన్ షాప్ నిర్వాహకుడిని గన్ తో బెదిరించాడు. వస్తువులను డిమాండ్ చేసి గొడవకు దిగాడు. దీంతో విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ నకిలీ గన్ అమెజాన్​లో తొమ్మిది వందల ఇరవై రూపాయలకు కొన్నది గా పోలీసులు గుర్తించారు. నిందితులు పోలీసు కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.