వివాదంలో సింగర్ మంగ్లీ ?

వివాదంలో సింగర్ మంగ్లీ ?

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న హైదరాబాద్ శివారు ఈర్లపల్లిలోని ఓ రిసార్టులో ఆమె బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం వినియోగంపై సమాచారంతో స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఇందులో 9 మంది గంజాయి సేవించినట్లు తెలుస్తోంది. వీరిలో మంగ్లీ ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మంగ్లీతో పాటు రిసార్టు నిర్వహకులపై కేసు నమోదు అయింది.