ఏప్రిల్ 26 న భారత్ బంద్

ఛత్తీస్ గఢ్ : ఏప్రిల్ 26 న భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు . ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడి ఘటనలో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే . అయితే ఛత్తీస్ గఢ్ ఎదురుకాల్పుల తర్వాత కనిపించని కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు . ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. ఆపరేషన్ ప్రహార్ -3 ని తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టులు ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఏప్రిల్ 26 న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. మరోవైపు మావోయిస్టులపై ప్రతీకారానికి కేంద్రం సిద్ధమవుతోంది. మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా అడుగులు వేస్తోంది . హిడ్మాను టార్గెట్ చేస్తూ కొత్త ఆపరేషన్ కు ప్లాన్ చేస్తోంది. అన్నీ ఉపసంహరించుకోవాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరింది.

ads