ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లా రిజర్వు గార్డ్స్‌ (డీఆర్‌జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. నారాయణపూర్‌ జిల్లాలో 27మంది సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా.. 15మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ads