కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ అప్ కౌన్సిలింగ్

వరంగల్ అర్బన్ జిల్లా : కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ అప్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు కోర్సు అలాగే కళాశాలల వారీగా ప్రాధాన్యతా క్రమంలో నిర్ధేశిత గడువు లోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

ads

ఖాళీ సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఈనెల 7న ఉదయం 9 నుంచి 8 రాత్రి 7 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.