‘మరణం’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అడివి శేష్హైదరాబాద్: శ్రీమతి బీ రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో. వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం “మరణం”. కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక . ఈ సినిమా మొదటి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు అడివి శేష్ విడుదల చేశారు.
‘మరణం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. పోస్టర్ చాలా బాగుంది మరియు భయపెడుతుంది. నాకు హారర్ చిత్రాలు అంటే భయం కానీ చాలామంది ప్రేక్షకులు ఇలాంటి హారర్ చిత్రాలు బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడతారు. పోస్టర్ ఎంత బాగుందో టీజర్ కూడా అంతే బాగుంది. మంచి సాంకేతిక విలువలతో నిర్మించారు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని అనిపించింది. హీరో దర్శకుడు వీర్ కి హీరోయిన్ శ్రీ రాపాక కి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాదించాలి’అని కోరుకుంటున్నాను అన్నారు హీరో అడివిశేష్.
‘మా ‘మరణం’సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అడివి శేష్ విడుదల చేయడం చాలా సంతోషం గా ఉంది. మా సినిమా విజయానికి ఇది మా మొదటి అడుగు. మేము పిలవగానే వచ్చి మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన అడివి శేష్‌కు ధన్యవాదాలు. నన్ను నా కథను నమ్మి మా చిత్రాన్ని నిర్మించిన మా నిర్మాత బీ రేణుకకు నా ధన్యవాదాలు. మా హీరోయిన్ శ్రీ కి స్పెషల్ థ్యాంక్స్. తాను తన సొంత సినిమాగా పని చేసింది. ఈ సినిమా మా అందరికి మంచి బ్రేక్ ఇస్తుంది’అని తెలిపారు హీరో దర్శకుడు వీర్ సాగర్.
‘మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో అడివి శేష్‌కు ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమా లో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా హీరో డైరెక్టర్ వీర్ సాగర్‌కు ధన్యవాదాలు. కరోనా టైం లో లాక్ డౌన్ లో సినిమా చేశాం. అవుట్ ఫుట్ బాగా వస్తుంది. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మా టీం కి ధన్యవాదాలు ’అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మనోజ్ కుమార్ చేవూరి, చిత్ర నటి మాధురి మరియు ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
నటి నటులు : వీర్ సాగర్, శ్రీ రాపాక, మాధురి
బ్యానర్ : ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ : శ్రీమతి బీ రేణుక
చిత్రం పేరు : మరణం
కెమెరా మాన్ : కేవీ వరం
సంగీతం : మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్ & వీఎఫ్ఎక్స్ : నరేన్
ఎస్ఎఫ్ఎక్స్ : షఫీ
డీఐ : రవి తేజ
ప్రొడక్షన్ కో ఆర్డినేటర్ : బీ శ్రీనివాస్
కాస్ట్యూమ్స్ : నీలిమ
5. 1 మిక్సింగ్ : వెంకట్ రావు
పబ్లిసిటీ డిజైన్ : షాహిద్
ప్రొడక్షన్ కంట్రోలర్ : సాయి, శ్రీకాంత్ శివ
మేకప్ : వంశి కృష్ణ
డైరెక్షన్ టీం : నందు, బాలు, ఆర్య , కార్తీక్
పీఆర్వో : పాల్ పవన్