డీసీసీబీ బ్యాంక్ టైమింగ్స్ కుదింపు

వరంగల్ అర్బన్ జిల్లా : డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్ రావుకి తెలంగాణ సహకార ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు వినతి పత్రం అందచేశారు. ఇట్టి ప్రతిపాదనను తీర్మానం చేసి రేపటి నుండి బ్యాంకు టైమింగ్స్ ని మార్పు చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయం నక్కలగుట్టలో కొవిడ్ విజృంభిస్తున్న సందర్బంగా బ్యాంకు సమయాన్ని 10.30 నుండి 2.30 వరకు కుదించాల్సిందిగా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్ రావు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో లో సీఈఓ చిన్నారావు, డిజిఎం అశోక్, యూనియన్ నాయకులు కృష్ణ మోహన్, అజయ్, బోడ రాజు, శ్రీలత రాజు, తదితరులు పాల్గొన్నారు.

ads