అగ్రరాజ్యంలో భారీ సంక్షోభం

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి పెను విషాదాన్నే మిగిల్చింది. ఆ దేశంలో క‌రోనా మరణాల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు చేరువలోకి వ‌చ్చింది. ఆదివారం రాత్రివ‌ర‌కు అక్క‌డ మొత్తం 4.98 లక్షల కొవిడ్ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ నివేదికలు ఈ వివ‌రాల‌ను వెల్లడించాయి. కాగా, దాదాపు 102 ఏండ్ల క్రితం ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్‌ సృష్టించిన విలయం తర్వాత అగ్ర‌రాజ్యంలో అంతటి భారీ సంక్షోభం ఇదేనని ఆ దేశ ఆరోగ్య నిపుణుడు ఆంటోనీ ఫౌసీ తెలిపారు.