భద్రాద్రి రాముల వారికి భారీ విరాళం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి దేవస్థానం చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జానకీ రాముల వారికి స్వర్ణ భద్రకవచాలు అమరాయి. ఇక నుంచి జానకీ రాముల వారు స్వర్ణ కవచాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సుమారు 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం.

ads

ఇకనుంచీ ప్రతీ శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేరు.