బ్యాటింగ్‎తో మాక్స్‎వెల్ వీరవిహారం

వెల్లింగ్టన్ : ఐపీఎల్ 14వ ఎడిషన్ కు ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‎రౌండర్ గ్లెన్ మాక్స్‎వెల్ తుఫాన్ ఇన్నింగ్స్‎తో చెలరేగాడు. మునుపటి బ్యాటింగ్‎తో వీరవిహారం చేశాడు. న్యూజిలాండ్‎తో మూడో టీ 20లో మాక్స్‎వెల్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 70 పరుగులు సాధించాడు. మాక్స్‎వెల్‎తో పాటు కెప్టెన్ అరోన్ ఫించ్ ( 69), ఫిలిప్ ( 43), రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కివీస్ 17.1 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో కంగారూలు 64 పరుగుల తేడాతో గెలిచారు.

ads

ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ( 43), డెవన్ కాన్వే (38) మాత్రమే ధాటిగా ఆడగా మిగతా బ్యాట్స్‎మెన్ తేలిపోయారు. ఆసీస్ బౌలర్ ఆస్టన్ అగర్ 4 ఓవర్లు వేసి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడం విశేషం. ఐపీఎల్‎లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇటీవల జరిగిన వేలంలో మాక్స్‎వెల్‎ను 14.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.