ఫిబ్రవరి 11న మేయర్​ ఎన్నిక

హైదరాబాద్​ : జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారథి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ జిల్లా కలెక్టర్ ఎన్నికల పరిశీలకునిగా వ్యవహరించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. ఆరోజు కుదరకపోతే మరుసటి రోజు 12న, ఆరోజు సెలవు ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకునిగా నియమించనుంది.